ఆదాయపు పన్ను సమర్పించడానికి గడువును ప్రభుత్వం మరోమారు పొడిగించింది. 2018-19 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఐటి రిటర్నులను సెప్టెంబర్ 30 వరకు చెల్లించవచ్చని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) వెల్లడించింది. గతంలో పేర్కొన్న ప్రకారం రేపటితో ఈ గడువు ముగుస్తుంది. అయితే కరోనా సంక్షోభం నేథ్యంలో పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.
2018-19 ఆర్థిక సంవత్సర రిటర్నలు చెల్లిండానికి గడువును పొడిగించడం ఇది మూడోసారి. ఈ ఏడాది మార్చి 31గా గడువును జూన్ 30కి పొడిగించారు. మళ్లీ దీన్ని జూలై 31 వరకు, తాజాగా సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు.