ఏపీలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. వరుసగా రెండురోజులు 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో కొత్తగా 10,167 పాటిజివ్ కేసులు నమోదు కాగా మొత్తం కేసులు సంఖ్య 1,30,557కి చేరింది. వీరిలో 60,024 మంది మహమ్మారి బారి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా 69,252 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఒక్కోరోజే 68 మంది మృతి చెందగా ఇప్పటివరకు 1,281 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 70,068 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 18.9 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.
