ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ మరోసారి నియామకం

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను మరోసారి నియమిస్తూ ప్రభుత్వం అర్ధరాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తిరిగి నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గవర్నర్‌ పేరిట పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి నోటిఫికేషన్‌  జారీ చేశారు. సుప్రీంలో దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ తుది తీర్పునకు లోబడి నోటిఫికేషన్‌  ఉంటుందని స్పష్టం చేశారు. 

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఎస్‌ఈసీగా ఉన్న సమయంలో కోవిడ్‌ 19 వ్యాప్తి చెందుతున్న తరుణంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి ఆయనను పదవి నుంచి తొలగించారు. దీనిపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది.