ఏపీలో మూడు రాజధానులకు గ్రీన్‌ సిగ్నల్‌

ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఆ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో మూడు రాజధానులకు అధికారికంగా అనుమతి లభించినట్లుయ్యింది. ఇక ఏపీకి శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూల్‌ ఉండనున్నాయి. సీఆర్డీఏ చట్టం-2014 రద్దు బిల్లుతోపాటు, ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లులకు జనవరి 20నే ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. బిల్లులపై చర్చించేందుకు శాసన మండలికి పంపగా అక్కడ ఎలాంటి చర్చ జరుగకుండానే వాయిదా పడడంతో మూడు వారాల క్రితం గవర్నర్‌ ఆమోదానికి పంపారు. న్యాయసలహా అనంతరం గవర్నర్‌ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. అదే సమయంలో సీఆర్డీఓ చట్టం-2014 బిల్లును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.