ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని 26,778 మంది వైద్య సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో సాయపడనుంది.
రాష్ట్ర ప్రభుత్వం నియమించనున్న ఈ 26,778 పోస్టుల్లో మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్ట్ డాక్టర్, స్టాఫ్ నర్స్, టెక్నీషియన్ ఉద్యోగాలున్నాయని తెలిసింది. జూలై 31 నుంచి ఆగస్టు 5వరకు వీటిని భర్తీ చేయాలని కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ నేరుగా ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో సుమారు 10,000 మంది ఆరోగ్య సంరక్షణ కార్మికులను నియమించడానికి ఆమోదం తెలిపింది. వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణులు, ఇతర పోస్టులను ఆరోగ్య విభాగంలో భర్తీ చేయనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం 9,712 మంది సిబ్బందిని నియమించే విధంగా మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదనను ఆమోదించారు.
ఇవే కాకుండా వైద్యానికి రూ .1000 కన్నా ఎక్కువ ఖర్చు అయితే దాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చబడింది. జూలై 16 నుంచి మరో ఆరు జిల్లాల్లో దీన్ని అమలు చేశారు.