తిరుమలలోని స్వామివారిని శుక్రవారం 4,984 భక్తులు దర్శించుకున్నారు. 1540 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఆలయానికి రూ.35లక్షల ఆదాయం వచ్చిందని వారు తెలిపారు. . శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగిందని వివరించారు. పవిత్రోత్సవాల మూడోరోజు శనివారం పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు.
