బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు (60) మృతిచెందారు. నెలరోజుల కిందట ఆయకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిశారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి విజయం సాధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1989లో బీజేపీలో చేరిన ఆయన పార్టీ అభివృద్ధి కోసం పని చేసి.. చివరి వరకూ అదే పార్టీలో కొనసాగారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.