ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. గడిచిన రెండురోజులు రికార్డుస్థాయిలో 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా తాజాగా శనివారం 9,276 కేసులు నమోదు కాగా 59 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 1,50,209 కరోనా కేసులు నమోదు కాగా 72,118 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 76,614 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 1,407 మంది తీవ్ర ఇన్‌ఫెక్షన్ కారణంగా మృతి చెందారు. ఇవాళ ఒక్కరోజే సుమారు 60,797 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు 20 లక్షల మందికి పూర్తి చేశామని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.