కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కు కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని అమిత్ షానే స్వయంగా వెల్లడించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నట్టు ఆయన వెల్లడించారు. తనకు చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా రావడంతో తాను ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో తనుతో కలిసి తిరిగిన వారు, తనను సంప్రదించినవారితో పాటు ఇతర కాంటాక్ట్ లు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.