ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురం పెదబొందపల్లిలోని తన నివాసంలో కన్నుమూశారు. 1972 జననాట్య మండలిని స్థాపించి.. తన జానపద గేయాలతో పల్లెకారులతో పాటు గిరిజనులను వంగపండు ఎంతగానో చైతన్యపరిచారు. తన జీవిత కాలంలో వందలాది జానపదాలకు వంగపండు గజ్జెకట్టాడు. 2017లో కళారత్న పురస్కారం అందుకున్నారు.