సివిల్స్ పరీక్షలో ఆల్ ఇండియా లో 110 ర్యాంక్ సాధించిన సిద్దిపేట బిడ్డ మంద మకరంద్ ను ట్విట్టర్ ద్వారా ఆర్థిక శాక మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఖ్యాతి ని సిద్దిపేట బిడ్డగా దేశ స్థాయిలో నిలిపినందుకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఉన్నత స్థాయిలో రాణించాలని మంత్రి ఆకాంక్షించారు.
కాగా, దేశంలోనే అత్యున్నతస్థాయి ఉద్యోగాల నియామకం కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. 2019 సెప్టెంబర్‌లో మెయిన్స్ పరీక్షలు జరుగగా.. 2020 ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ఇంటర్వ్యూలో నెగ్గి మొత్తం 829 మంది సర్వీసులకు ఎంపికైనట్లు యూపీఎస్సీ తెలిపింది. ఆ జాబితాలో ప్రదీప్ సింగ్ అనే అభ్యర్థి మొదటి ర్యాంక్ దక్కించుకోగా.. జతిన్ కిషోర్ 2వ, ప్రతిభా వర్మ 3వ ర్యాంకు సాధించారు. తెలంగాణ బిడ్డ మకరంద్ మెరుగైన ర్యాంక్ సాధించడంతో అభినందనలు వెల్లువెత్తున్నాయి.