గ్రీన్ ఇండియాకు ప్రశంసల జల్లు

మొక్కలు నాటిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ రైల్వేస్ చైర్మన్ రాధా మోహన్ సింగ్

హైదరాబాద్ కు వచ్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ రైల్వేస్ చైర్మన్ రాధా మోహన్ సింగ్ మరియు సభ్యులు తార్నాకాలోని ఇరిసెట్లో సమావేశమైన కమిటీ.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను టేక్ అప్ చేసిన కమిటీ. ఇరిసెట్ ప్రాంగణంలో మొక్కలు నాటిన చైర్మన్ మరియు సభ్యులు.
ఈ సందర్బంగా కమిటీ చైర్మన్ మరియు సభ్యులకు హారా హై తో భరా హై కాన్సెప్ట్ ను వివరించిన కమిటీ మరో సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్.
పచ్చదనం పెంపొందించే ఈ కార్యక్రమాన్ని ప్రశంసించిన కమిటీ చైర్మన్ మరియు సభ్యులు. దీన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని అభిప్రాయపడిన కమిటీ.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తామూ భాగస్వాములం అవుతామనీ, తమతమ ప్రాంతాలలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసులెళ్తామని వెల్లడి.