తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1139 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 50,814కి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 2013 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 70,958 మందికి కరోనా వైరస్ సోకింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో 19,568 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు కొత్తగా 13 మంది బాధితులు మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 576 మంది మృతిచెందారు.
