అయోధ్యలో పారిజాత మొక్కను నాటిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అయోధ్యలో పారిజాత మొక్కను నాటారు. భవ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజకు ముందు అక్కడి రామ్‌లల్లాను ఆయన దర్శించుకుని సాష్టాంగ సమస్కారం చేశారు. అనంతరం మోదీ అక్కడ పారిజాత మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రధాని పక్కన ఉన్నారు. పారిజాతను దైవ సంబంధమైన మొక్కగా హిందువులు భావిస్తారు. భారతీయ ఇతిహాసాల్లో పారిజాత మొక్క విశిష్ఠత గురించి అనేక కథనాలున్నాయి