సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు విదార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించినందుకు సంతోషంగా ఉందంటూ బుధవారం ట్వీట్ చేశారు. ‘సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులతో ఘనవిజయాలు సాధించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. వీరిందరికీ శుభాకాంక్షలు. తమ ప్రతిభను విధినిర్వహణలో చూపిస్తూ ప్రజలకు మంచి సేవలందిస్తారని ఆకాంక్షిస్తున్నాను’సీఎం జగన్ ట్వీట్ చేశారు.
