తెలంగాణ ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్‌లో రెండోవిడుత ప్రవేశాలకు అర్హుల జాబితాను విడుదల చేశారు. ఆర్‌జేసీసెట్ ద్వారా ఇంటర్ ఫస్టియర్ ఆర్ట్స్ అండ్ సైన్స్, వొకేషనల్ కోర్సుల్లో ప్రవేశానికి.. అర్హులైన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనను నిర్ణయించిన జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు నేటి నుంచి 16వ తేదీ వరకు పరిశీలిస్తారు. అభ్యర్థులు అర్హత ధృవీకరణపత్రం, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, సంబంధిత పత్రాలతో హాజరుకావాలని అధికారులు సూచించారు.
