తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు. గురువారం అరణ్య భవన్ లో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు. ఫ్రొఫెసర్ జయశంకర్ చిరస్మరణీయుడని ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణే ఊపిరిగా, శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ కోసం ఉద్యమించారని కొనియాడారు.
తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో సీఎం కేసీఆర్కు వెన్నంటి ఉండి రాష్ట్ర సాధనలో భాగస్వాములయ్యారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేశారని, సార్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధిలో అందరూ పునరంకితం కావాలని మంత్రి అకాంక్షించారు. ప్రొఫెసర్ జయశంకర్ జీవితం భావి తరాలకు స్ఫూర్తి దాయకమన్నారు. అభివృద్దితో పాటు హరిత తెలంగాణలో ప్రజలందారూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.శోభ, జాయింట్ సెక్రటరీ ఎం. ప్రశాంతి, పీసీసీఎఫ్ లు లోకేష్ జైస్వాల్, ఆర్.ఎం.డొబ్రియాల్, అదనపు పీసీసీఎఫ్ లు శ్రీనివాస్, ఎంసీ.పర్గెన్, చంద్రశేఖర్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.