కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(85) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లయ్య.. జులై 29న నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత పది రోజుల నుంచి కరోనా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నంది ఎల్లయ్య మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
గతంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా నంది ఎల్లయ్య పని చేశారు. సిద్దిపేట లోక్‌సభ స్థానం నుంచి ఐదుసార్లు పార్లమెంట్‌కు ఎన్నిక కాగా, నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. రెండు సార్లు రాజ్యసభకు ఎన్నిక కాగా, ఎమ్మెల్సీగా కూడా నంది ఎల్లయ్య పని చేశారు.