మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్

 తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వరసగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి మంత్రి మల్లారెడ్డికి కరోనా బారినపడ్డారు. ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీంతో మంత్రి సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో చికిత్స పొందుతున్నారు. మ‌ల్లారెడ్డి కుటుంబీకులు, ఆయ‌న‌కు స‌న్నిహితంగా మెలిగిన‌వారిని గుర్తించి క‌రోనా టెస్టులు చేస్తున్నారు వైద్యులు. అటు తెలంగాణలో అధికారులు, ప్రజాప్రతినిధులను కోవిడ్-19 భయం వెంటాడుతుంది. ఇప్పటికే పలువురు ఎంఎల్ఎలు కరోనా భారిన పడి కోలుకున్నారు. అటు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది.