ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన రేకల భద్రాద్రీ

మొక్కలు నాటిన రేకల భద్రాద్రీ, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు, నల్గొండ

గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్ర గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ అయాచితం శ్రీధర్ గారు జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులకు విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించి జిల్లా గ్రంధాలయ ఆవరణలో మామిడి,జామ,దానిమ్మ చెట్లను నాటడం జరిగింది.. ఈ ఛాలెంజ్ ని 01) అబ్బగోని రమేష్ (నల్గొండ టి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు) 02) గోలి అమరేందర్ రెడ్డి (రెడ్ క్రాస్ ఛైర్మన్ నల్గొండ) 03) డా పుల్లారావు (IMA అధ్యక్షులు నల్గొండ) గారులను స్వీకరించాలని కోరుతున్నాను. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. గ్రీన్ ఛాలెంజ్ ను చేపట్టిన శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యావాదాలు తెలుపుతున్నాను.