కరోనా మహమ్మారి దేశాన్ని గజగజ వణికిస్తోంది. కరోనా ఉధృతికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు కరోనా సోకిన విషయం విదితమే. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు. వేరే సమస్య వల్ల ఆస్పత్రికి వెళ్లినప్పుడు.. తనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత వారం రోజుల నుంచి తనను ఎవరైతే కలిశారో.. వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి అని మాజీ రాష్ర్టపతి విజ్ఞప్తి చేశారు. కొవిడ్ పరీక్షలు చేయించుకున్న తర్వాత స్వీయ నియంత్రణ పాటించాలని ప్రణబ్ ముఖర్జీ కోరారు.