ఏపీలో కొత్త‌గా 9,996 క‌రోనా పాజిటివ్ కేసులు

 గ‌త కొన్ని రోజులుగా క‌రోనా వైరస్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శిస్తోంది. ప్ర‌తిరోజూ ప‌ది వేల‌కు చేరువ‌లో కేసులు బ‌య‌ట‌ప‌డుతుండ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో 55,692 కోవిడ్ టెస్టులు నిర్వ‌హించ‌గా 9,996 కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,64,142కు చేరుకుంది. రికార్డు స్థాయిలో ప‌రీక్ష‌లు చేస్తుండ‌టంతో కోవిడ్‌ ప‌రీక్ష‌ల సంఖ్య 27 ల‌క్ష‌లు దాటింది. ఈ నెల 13 నాటికి మొత్తం ప‌రీక్ష‌ల సంఖ్య‌ 27,05,459కు చేరుకుంది.

తాజాగా 9,499 మంది క‌రోనాను జ‌యించి ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అవ‌గా మొత్తం రిక‌వ‌రీ కేసుల కేసుల సంఖ్య 1,70,924గా ఉంది. క‌రోనా కార‌ణంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 82 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 2378కు చేరుకుంది. ప్రస్తుతం 90,840 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.