ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 19వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో ఒకటవ బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.