కంటోన్మెంట్ రోడ్ల‌ను తెర‌వండి: మ‌ంత్రి కేటీఆర్‌

 సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో మూసివేసిన రోడ్ల‌ను తెర‌వాల‌ని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్ర‌భుత్వాన్నికోరారు. ఈమేర‌కు కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ‌న్‌థ్‌సింగ్‌కు కేటీఆర్ లేఖ‌రాశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్లు మూసివేయడం వ‌ల్ల హైద‌రాబాద్ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని లేఖ‌లో పేర్కొన్నారు. సైనికాధికారులు మున్సిప‌ల్ ప్రొటోకాల్‌ను పాటించ‌డం లేద‌ని వెల్ల‌డించారు.