ఏపీలో కొత్త‌గా 8,012 క‌రోనా పాజిటివ్ కేసులు.. 88 మంది మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 8,012 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 48,746 శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా వీటిలో 8,012 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాయి. కోవిడ్‌-19 కార‌ణంగా ఒక్క‌రోజులో 88 మంది మృత్యువాత‌ప‌డ్డారు. 10,117 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాల వారీగా కోవిడ్‌-19 మ‌ర‌ణాలు నేడు ఈ విధంగా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 10 మంది, తూర్పుగోదావ‌రి-10, క‌ర్నూలు-9, నెల్లూరు-9, అనంత‌పురం-8, ప‌శ్చిమ‌గోదావ‌రి-8, విశాఖ‌ప‌ట్నం-7, గుంటూరు-6, క‌డ‌ప‌-6, ప్ర‌కాశం-4, శ్రీ‌కాకుళం-4, విజ‌య‌న‌గ‌రం-4, కృష్ణా జిల్లాలో ముగ్గురు చొప్పున మ‌ర‌ణించారు.