వరంగల్ మహానగరంలో వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎడతెరపి కురిసిన వర్షాలకు నగరం అతలాకుతలం కాగా, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికార యంత్రాంగం అంతా సహాయక, పునరావాస చర్యల్లో వేగం పెంచింది. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. కమలాపూర్ మండలంలో పలు గ్రామాల్లో వరదలకు దెబ్బ తిన్న ప్రాంతాలను ఈటల పరిశీలించారు. సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. అధిరాలకు పలు సూచనలు చేశారు. ఎవరూ అధైర్యపడొద్దని అప్రమత్తంగా ఉండాలన్నారు.