తెలంగాణలో మరో 1,682 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 19,579 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1682 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైనవాటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 93,937 కు చేరింది. వైరస్‌ బాధితుల్లో తాజాగా 8 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 711 కు చేరింది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌లో పేరొంది. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 7,72,928 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది.