దేశంలో మరో 55,079 మందికి సోకిన కరోనా

 భారత్ లో కరోనా మహమ్మారి విస్తరణ వేగంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 8,99,864 నమూనాలను పరీక్షించగా 55,079 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 876 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 27,02,743కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 6,73,166 యాక్టివ్ కేసులుండగా… 19,77,780 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇండియాలో కరోనా మరణాలు 51,797కి చేరాయని ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఆగస్టు17 వరకు 3,09,41,264 కోవిడ్ బాధితుల నమూనాలను పరీక్షించినట్టు ఐసిఎంఆర్ తెలిపింది.