మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే   ఎడ్మ కృష్ణారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి   కేసీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు.  సామాజిక సేవా దృక్పథం, సామాజిక స్పృహ కలిగిన నాయకుడిగా కృష్ణారెడ్డి ప్రజల అభిమానం సంపాదించారని సీఎం  అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని  ప్రార్థించారు.

ఎడ్మ కృష్ణారెడ్డి  ఇవాళ అనారోగ్యంతో  కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఒమేగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ   తుది శ్వాస విడిచారు.