దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆదివారం రామలింగారెడ్డి సంతాప సభ నిర్వహించిన తర్వాత లక్షణాలతో బాధపడుతున్న కుటుంబ సభ్యులు కరోనా పరీక్ష చేయించుకున్నారు. దీంతో రామలింగారెడ్డి భార్య, కుమారుడు, ఇద్దరు పిల్లలకు పాజిటివ్ ఉన్నట్లు మంగళవారం తేలింది. దీంతో చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. రామలింగారెడ్డి మరణం నుంచి సంతాప సభ వరకు తమతో కలసి ఉన్నవారు. తమను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని రామలింగారెడ్డి కుటుంబ సభ్యులు కోరారు.
