‌కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్

 ‌కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ అశోక్ ల‌వాసా రాజీనామాను రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ మేర‌కు కేంద్ర న్యాయ‌శాఖ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇది ఆగ‌స్టు 31 నుంచి మ‌ల్లోకి వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించింది.  ఎన్నిక‌ల క‌మిష‌న్‌లో సీనియారిటీ ప‌రంగా అశోక్ ల‌వాసా రెండో స్థానంలో ఉన్నారు. గ‌తంలో ఆయ‌న కేంద్ర ఆర్థికశాఖ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు. అక్క‌డ రిటైర్ అయిన‌ త‌ర్వాత 2018 జ‌న‌వ‌రిలో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. 

ఫిలిప్పీన్ కేంద్రంగా ప‌నిచేస్తున్న ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఉపాధ్య‌క్షుడిగా అశోక్ ల‌వాసా నియ‌మితుల‌య్యారు. వ‌చ్చే నెల‌లో ఆ ప‌ద‌విని చేప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ద‌ని స‌మాచారం. ఈనేప‌థ్యంలో ఆయ‌న ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేశారు.