‘పుడమి పచ్చగుండాలె- మన బతుకులు చల్లగుండాలె’ నినాదంతో రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స్వీకరించిన ప్రభాస్ తన ఇంట్లో మూడు మొక్కలు నాటి అనంతరం సినీనటులు రామ్‌చరణ్, దగ్గుబాటి రానా, శ్రద్ధాకపూర్‌ను గ్రీన్‌ఇండియా చాలెంజ్‌కు నామినేట్ చేశారు. అలానే శృతి హాసన్ కూడా మహేష్ ఛాలెంజ్‌ని స్వీకరించి తన ఇంటి ఆవరణళో మొక్కలు నాటి రానాని నామినేట్ చేసింది.
తాజాగా దగ్గుబాటి రానా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరిస్తూ మొక్కలు నాటారు. మొక్కలు నాటిన ఫోటోని తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. కొద్దిగా ఆలస్యం అయింది. ఆదిపురుష్ ప్రభాస్, రాక్‌స్టార్ శృతి హాసన్ ఛాలెంజ్ స్వీకరించాను. ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు చేపట్టాలని కోరుతున్నాను. పచ్చని భారతదేశం కోసం ప్రతి ఒక్కరం పాలుపంచుకుందాం అని రానా పేర్కొన్నారు. కాగా, ఆగస్ట్ 8న రానా తన ప్రేయసి మిహికా మెడలో మూడు ముళ్లు వేసిన విషయం తెలిసిందే