గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క‌లు నాటిన హీరో సుశాంత్‌

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు దేశ వ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. ఈ ఛాలెంజ్‌ను స్వీక‌రించి రంగాల‌తో సంబంధం లేకుండా అంద‌రూ మొక్క‌లు నాటుతు‌న్నారు. ఈ నేప‌థ్యంలో నాగ‌చైత‌న్య అక్కినేని విసిరిన ఛాలెంజ్‌ను స్వీక‌రించి హీరో సుశాంత్‌ మొక్క‌లు నాటారు.

సంతోష్ కుమార్‌గారు ప్రారంభించిన గొప్ప కార్య‌క్ర‌మంలో ప్ర‌తిఒక్క‌రినీ భాగ‌స్వాములు చేసినందుకు కృత‌జ్ఙ‌త‌లు తెలిపారు సుశాంత్‌. అయితే ఈ గొప్ప ప‌నికి మ‌రో న‌లుగురిని నామినేట్ చేశారు సుశాంత్‌‌. పూజా హెగ్డే, సుజీత్, ఐశ్వ‌ర్య రాజేష్‌, ప‌రుప‌ల్లి క‌శ్య‌ప్‌ల‌కు ఛాలెంజ్ విసిరారు. వీరిని ఛాలెంజ్‌ను స్వీక‌రించి మొక్క‌లు నాటాల‌ని కోరారు.