శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది మరణించారు. ప్రమాద సమయంలో 19 మంది సిబ్బంది ఉండగా వారిలో 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. లోపల చిక్కుకున్న తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు.
