కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కమిషనర్‌గా కేంద్రఆర్థికశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్‌కుమార్ నియమితులయ్యారు. ఈ నెల 31న ఈసీగా వైదొలగనున్న అశోక్ లావాస స్థానంలో రాజీవ్‌కుమార్‌ను రాష్ట్రపతి నియమించారని న్యాయశాఖ పేర్కొంది. రాజీవ్ కుమార్ 1984 జార్ఖండ్ క్యాడర్‌కు చెందిన అధికారి. అశోక్ లావాస.. ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీసీ) ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
