తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,384 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో పాజిటివ్ కేసులు 1,04,249కి చేరాయి. తాజాగా 11 మంది వైరస్ ప్రభావంతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 755కి చేరింది. తాజాగా 1,851 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చారి అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 80,586 మంది వైరస్ కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 22,908 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన 2,384 పాజిటివ్ కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 472 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. కాగా, గత రెండు రోజులుగా ప్రభుత్వం కరోనా శాంపిల్స్ పరీక్షలను పెంచింది. రోజుకు 40వేలకుపైగా పరీక్షిస్తుండగా.. గడిచిన 24గంటల్లో 40,666 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది. ఇందులో 2,384 మందికి వైరస్ పాజిటివ్‌గా రాగా, 1,347 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. హైదరాబాద్ జీహెచ్ఎంసీ తర్వాత అత్యదికంగా జగిత్యాలలో 105, కరీంనగర్ 120, ఖమ్మంలో 105, మంచిర్యాలలో 90, నిజామాబాద్‌లో 148, రంగారెడ్డిలో 131, సూర్యపేటలో 110, వరంగల్ 87 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.
