పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే మహోన్నత ఆశయంతో ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్‌కి అనూహ్య స్పందన లభిస్తుంది. సినీ ప్రముఖులు ఈ ఛాలెంజ్‌ని స్వీకరిస్తూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు ఈ ఛాలెంజ్‌ని స్వీకరించి జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు.
ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమంని తలపెట్టిన సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలియజేసిన శివ నిర్వాణ ఈ ఛాలెంజ్‌ని ముందుకు తీసుకెళ్లాలంటూ సందీప్ రెడ్డి వంగా, సుధీర్ వర్మ, హరీష్ పెద్ది, సాహు గరపాటిలని నామినేట్ చేశారు. కాగా, శివ నిర్వాణ ప్రస్తుతం నాని హీరోగా టక్ జగదీష్ అనే చిత్రం చేస్తుండగా, గతంలో నిన్ను కోరి, మజిలీ వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించారు.