గత 24 గంటల్లో 46,712 మందికి కరోనా వైరస్ పరీక్షలు చేయగా 7,895 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,53,111కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరోనా నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 7,449 మంది డిశ్చార్జ్ అవ్వగా, మొత్తం 2,60,087 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 93 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89,742 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 32,38,038 మందికి కరోనా పరీక్షలు చేశారు.
