ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 8,601 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 3,61,712కు చేరుకుంది. ఇవాళ 86 మంది వ్యాధి బారిన పడి మృతి చెందగా ఇప్పటివరకు 3,368 మంది మృత్యువాత పడ్డారని సోమవారం రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 8,741 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా ఇప్పటివరకు 2,68,828 మంది రికవర్ అయ్యారు. ప్రస్తుతం 89,516 మంది కరోనా సోకి చికిత్స పొందుతున్నారు.
ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో 54,463 కరోనా పరీక్షలు చేయగా రాష్ర్టంలో ఇప్పటివరకు 32,92,501 పరీక్షలు చేశారు. తూర్పు గోదావరిలో అత్యధికంగా 1441 కేసులు నమోదు కాగా.. కృష్ణాజిల్లాలో అత్యల్పంగా 154 కరోనా కేసులు నమోదయ్యాయి.