గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మొక్కలు నాటిన లావణ్య త్రిపాఠి

‘పుడమి పచ్చగుండాలే మన బతుకులు చల్లగుండాలే’ అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో చిత్రసీమలోని వివిధ విభాగాల వారు పాలుపంచుకుంటున్నారు. సోమవారం గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో కథానాయిక లావణ్యత్రిపాఠి భాగమైంది. దర్శకురాలు నందినిరెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించిన ఆమె స్వస్థలం డెహ్రాడూన్‌లో తన సోదరుడితో కలిసి యాభై మొక్కలు నాటింది.   గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న కొరియోగ్రాఫర్‌ శేఖర్‌మాస్టర్‌ జూబ్లీహిల్స్‌ లోని పార్క్‌లో మొక్కలు నాటారు. ఒక్కరితో మొదలు పెట్టి  దేశ వ్యాప్తంగా విస్తరించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ను మనస్ఫూర్తిగా అభినందిసున్నట్లు ఆయన తెలిపారు. గ్రీన్‌చాలెంజ్‌లో నటుడు కోటేశ్వరరావు, సాకేత్‌మాధవి భాగమయ్యారు.