తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాయు నాణ్యతను తెలుసుకునేందుకు పీసీబీ రూపొందించిన ‘టీఎస్ ఎయిర్’ మొబైల్‌యాప్‌ను అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం సనత్‌నగర్‌లోని పీసీబీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ యాప్‌తో ప్రజలు తమ ప్రాంతంలో వాయు నాణ్యతను తెలుసుకోవచ్చని, ప్రజలు ఫిర్యాదు కూడా చేయవచ్చని చెప్పారు. అనంతరం రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాలుష్య నివారణకు దీర్ఘకాలిక లక్ష్యాలు, ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
