పంజాగుట్ట ఠాణాలో ఇటీవల నమోదైన లైంగికదాడి కేసు సీసీఎస్‌కు బదిలీ చేశారు. తనపై పదేండ్లుగా 139 మంది లైంగికదాడికి పాల్పడటమే కాకుండా, బెదిరింపులు, కులం పేరుతో దూషించారంటూ గత శుక్రవారం ఓ మహిళ పంజాగుట్ట పోలీసులకు వంద పేజీల ఫిర్యాదు ఇవ్వడం సంచలనం సృష్టించింది. ఈ కేసు లో పంజాగుట్ట పోలీసులు 139 మందిని నిందితులుగా పేర్కొన్నారు. సంచలనమైన ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు విభాగానికి ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించి సీసీఎస్‌కు బదిలీ చేశారు. దర్యాప్తు ప్రారంభించామని సీసీఎస్ జాయింట్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు.
