కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా : జిల్లాలోని సిర్పూర్ టి నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత రెండు, మూడు రోజులుగా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న కోనప్ప దంపతులు బుధవారం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వారి ఇద్దరికి పాజిటివ్ గా తేలినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కాగజ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వీరికి ప్రత్యేకంగా ఐసోలేషన్ ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నట్లు తెలిసింది.
