నిజామాబాద్‌ జిల్లాలో 173 మంది వీఆర్‌ఓల బదిలీ

నిజామాబాద్ జిల్లాలో భారీగా వీఆర్‌ఓలను బదిలీ చేశారు. 173 మంది వీఆర్‌ఓలను బదిలీ చేస్తూ అదనపు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం విధుల్లో చేరాలని ఆదేశించారు. మరోవైపు మేడ్చల్ జిల్లా రెవెన్యూశాఖలో కూడా  బదిలీలు జరిగాయి. 18 మంది వీఆర్‌ఓలను బదిలీ చేస్తూ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు.