ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. నిత్యం వేలల్లో కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా 10,621 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,90,195కు చేరాయి. ప్రస్తుతం 94,209 మంది చికిత్స పొందుతుండగా, 2,92,353 మంది కోలుకున్నారని పేర్కొంది. తాజాగా వైరస్ ప్రభావంతో 92 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 3,633కు చేరింది. నిన్న ఉదయం 10 గంటల నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు 8,528 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారని తెలిపింది. తాజాగా 61,300 టెస్టులు చేయగా, ఇప్పటి వరకు 34,79,990 పరీక్షలు చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.
