మాజీ కార్మికశాఖ మంత్రి, టీడీపీ నాయకుడు కె. అచ్చెన్నాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈఎస్ఐ ఆస్పత్రి మందుల కొనుగోలు కుంభకోణంలో అచ్చెన్నాయుడు ఈ ఏడాది జూన్ 12న అరెస్టు అయిన సంగతి తెలిసిందే. హైకోర్టు బెంచ్ నేడు తీర్పును వెలువరిస్తూ షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ. 2 లక్షలు డిపాజిట్ చేయాల్సిందిగా ఆదేశించింది. అదేవిధంగా దేశం విడిచి వెళ్లొద్దని పేర్కొంది. ఏపీ ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడానికి రెండు రోజుల ముందే ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు జులైలో గుంటూరులోని రమేష్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
