గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,734 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,27,697కు చేరాయి. వైరస్ ప్రభావంతో మరో 9 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 836కి చేరింది. తాజాగా 2,325 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 95,162 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,699 యాక్టివ్ కేసులు ఉండగా, 24,598 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో 0.65శాతం మరణాల రేటు ఉండగా, దేశంలో 1.77శాతంగా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో రికవరీ రేటు 74.5శాతంగా ఉందని చెప్పింది.
తాజాగా సోమవారం ఒకే రోజు 58,264 టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు 14,23,846 శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది. 878 శాంపిల్స్ రిపోర్టులు రావాల్సి ఉందని, పది లక్షల జనాభాకు 38,358 మందికి టెస్టులు చేస్తున్నట్లు పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో 347 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. తర్వాత అత్యధికంగా రంగారెడ్డిలో 212, నల్గొండ 191, ఖమ్మం 161, భద్రాద్ది కొత్తగూడెం 117, నిజామాబాద్ 114, వరంగల్ అర్బన్ 112, సిద్దిపేట 109, సూర్యాపేట 107, కరీంనగర్‌లో 106 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.