ఏపీలో కొత్తగా 10,392 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 10,392 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 72 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఏపీలో కరోనా మరణాల సంఖ్య 4,125కు చేరింది.  రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌-19 బాధితుల సంఖ్య 4,55,531కు చేరింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 1,03,076 యాక్టివ్‌  కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో 8,454 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా  కోలుకున్నారు.  నేటి వరకు రాష్ట్రంలో 38,43,550 శాంపిల్స్‌ను పరీక్షించారు.