తెలంగాణలో కొత్త‌గా 2817 క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య ల‌క్ష దాటింది. తాజాగా మ‌రో 2611 మంది బాధితులు కోలుకోవ‌డంతో మొత్తం కోలుకున్న‌వారి సంఖ్య 1,00,013కు చేరింది. రాష్ట్రంలో కొత్త‌గా 2817 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసులు 1,33,406కు చేరాయి. ఇందులో 32,537 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 25,293 మంది బాధితులు హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. క‌రోనాతో నిన్న కొత్తగా 10 మంది చ‌నిపోవ‌డంతో మొత్తం మ‌ర‌ణాలు 856కు చేరాయి. 

కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 36, భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో 89, జీహెచ్ఎంసీ ప‌రిధిలో 452, జ‌గిత్యాల‌లో 88, జ‌న‌గాంలో 41, జ‌య‌శంక‌ర్ ‌భూపాలప‌ల్లిలో 26, జోగులాంబ గ‌ద్వాల‌లో 33, కామారెడ్డిలో 62, క‌రీంన‌గ‌ర్‌లో 164, ఖ‌మ్మంలో 157, ఆసిఫాబాద్ జిల్లాలో 19, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 42, మ‌హ‌బూబాబాద్‌లో 62, మంచిర్యాల‌లో 71, మెద‌క్‌లో 35, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరిలో 129, ములుగులో 18, నాగ‌ర్‌క‌ర్నూల్‌లో 41, న‌ల్ల‌గొండ‌లో 157, నారాయ‌ణ‌పేట‌లో 21, నిర్మ‌ల్‌లో 16, నిజామాబాద్‌లో 97, పెద్ద‌ప‌ల్లిలో 75, రాజ‌న్న‌సిరిసిల్ల‌లో 53, రంగ‌రెడ్డిలో 216, సంగారెడ్డిలో 76, సిద్దిపేట‌లో 120, సూర్యాపేట‌లో 116, వికారాబాద్‌లో 27, వ‌న‌ప‌ర్తిలో 45, వ‌రంగ‌ల్ రూర‌ల్‌లో 46, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 114, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో 73 చొప్పున ఉన్నాయి.