తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,478 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,35,884కు చేరింది. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 866కు చేరింది. గురువారం ఒక్కరోజే 2,011 మంది కోవిడ్‌ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,02,024.

రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 32,994. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.14 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 75.0 శాతంగా ఉంది. భారత్‌లో మరణాల రేటు 1.74 శాతంగా ఉండగా.. తెలంగాణలో 0.63 శాతంగా ఉంది. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 62,543 పరీక్షలు నిర్వహించామని మొత్తం పరీక్షల 16,05,521కు చేరిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.